![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -857 లో..... రాజ్ కి సపోర్ట్ చేస్తానని ఇందిరాదేవి చెప్తుంది. థాంక్స్ నానమ్మ నువ్వైనా సపోర్ట్ గా ఉన్నవని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి కలిసి టాక్సిక్ కెమికల్స్ తో ఉన్న టపాసులు రెడీ చేయించి తీసుకొని వస్తారు. అవి కాలిస్తే కావ్య బిడ్డకి ప్రాబ్లమ్ అయి అబార్షన్ అవుతుందని ప్లాన్ చేస్తారు.
ఆ తర్వాత స్వరాజ్ ని పిలిచి ఆ టపాసులు ఇవ్వాలని ట్రై చేస్తారు కానీ స్వరాజ్ తీసుకోడు. మా మావయ్య కొనిస్తాడంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు రాజ్ కి కనకం వాళ్ళు బట్టలు తీసుకొని వస్తారు. కావ్యకి ఇచ్చి ఇవ్వమంటారు. నేను ఇస్తే అసలు తీసుకోడు మీరు ఈ బట్టలు ఇవ్వండి నేను పాత బట్టలు ఇస్తాను నాపై కోపంతో మీరు ఇచ్చిన బట్టలు వేసుకుంటారని కావ్య అనగానే ఇందిరాదేవి, కావ్య ఇద్దరు రాజ్ దగ్గరికి వెళ్తారు కానీ ఇందిరాదేవి తీసుకొని వెళ్లిన బట్టలు రాజ్ తీసుకుంటాడు. ఆ తర్వాత నేను చెప్పాను కదా అని కావ్య అంటుంది.
ఆ తర్వాత రాజ్ దగ్గరికి స్వరాజ్ వచ్చి టపాసులు కొనివ్వమని అడుగుతాడు . అందరు రెడీ అయి వచ్చి టపాసులు పేలుస్తారు. రుద్రాణి, రాహుల్ వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చిన టపాసులు రాజ్ తీసుకొని వచ్చిన దాంట్లో కలుపుతారు. అప్పుడే అప్పు, కళ్యాణ్ బయటకి వచ్చి రాహుల్, రుద్రాణి వాళ్ళు తీసుకొని వచ్చినవి తీసుకుంటారు. అప్పు అవి పేల్చి కళ్ళు తిరిగిపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |